అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలపై ఇకపై ఎలాంటి దాడులు జరగబోవని ఆయన ప్రకటించారు. అయితే పొరుగు దేశాలు తమపై నేరుగా దాడి చేస్తే ప్రతిస్పందించే హక్కు ఇరాన్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. దేశ తాత్కాలిక నాయకత్వ మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల దాడులు జరిగిన దేశాలకు కూడా క్షమాపణలు తెలియజేస్తూ, అవి ఉద్దేశపూర్వకంగా జరగలేదని తెలిపారు. ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను పెజెష్కియాన్ ఖండించారు. ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్న వారి కలలు నెరవేరవని, అలాంటి ఆశలను వారు వదిలేయాల్సిందేనని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















