పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లోని డెమోక్రటిక్ లాన్‌లో భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ పాకిస్థాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో న్యాయవాదులు, మేధావులు, పౌరసమాజ ప్రతినిధులు, భగత్‌సింగ్ అభిమానులు పాల్గొన్నారు.
ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ మాట్లాడుతూ.. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్‌సింగ్ పోరాటం భారత ఉపఖండ ఉమ్మడి చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఆయన ధైర్యం, రాజకీయ అవగాహన, పోరాట స్ఫూర్తి, త్యాగం భవిష్యత్ తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.
భగత్‌సింగ్ చరిత్ర ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితం కాదని.. భారత ఉపఖండ ఉమ్మడి చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు. భగత్‌సింగ్‌కు సంబంధించిన రచనలు, కోర్టు రికార్డులు, చారిత్రక పత్రాలను భద్రపరిచి యువతకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా భగత్‌సింగ్‌కు పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్-ఇ-పాకిస్థాన్ ఇవ్వాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు. ఆయన చారిత్రక పాత్రను గుర్తించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఫౌండేషన్ కోరింది.
భగత్‌సింగ్ 1907 సెప్టెంబరు 28న అవిభక్త పంజాబ్‌లోని లయల్‌పుర్ జిల్లాలో బంగా గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ జిల్లాలో ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















