యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ను గన్నవరం పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు. నిషేధిత మావోయిస్టు సంస్థకు మద్దతుగా వీడియోలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబరు 17న గన్నవరం కోర్టు రావణ్‌కు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.
కస్టడీలో భాగంగా వివిధ అంశాలపై పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా సున్నితమైన అంశాలపై చేసిన వీడియోలు, వాటి వెనుక ఉద్దేశాలు, స్క్రిప్ట్ రూపకల్పన తదితర వివరాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. హిందూ దేవతలను కించపరిచేలా ఉన్నట్లు పేర్కొంటున్న కొన్ని వీడియోలను చూపిస్తూ.. అలాంటి అంశాలపై వీడియోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. అందుకు ఇకపై అలా చేయకుండా ఉండాల్సిందని రావణ్ చెప్పినట్లు తెలుస్తోంది.
తాను సున్నితమైన అంశాలపై అనవసరంగా ఎక్కువగా స్పందించానని, తద్వారా కొన్ని వివాదాలను స్వయంగా తెచ్చుకున్నానని రావణ్ విచారణలో చెప్పినట్లు సమాచారం. వీడియోల కోసం స్క్రిప్ట్‌లను ఎవరి సూచనల మేరకు సిద్ధం చేస్తారని పోలీసులు ప్రశ్నించగా.. సాధారణంగా తానే స్వయంగా రూపొందిస్తానని, కొన్ని సందర్భాల్లో ఇతరుల సూచనలు తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపైనా పోలీసులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. వీడియోల ద్వారా వచ్చే ఆదాయం ఎంత? ఛానల్ నిర్వహణకు నిధులు ఎలా సమకూరుతున్నాయి? గమన పాత్ర ఏమిటి? అడ్మిన్ రైట్స్ ఎవరెవరికి ఉన్నాయి? వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ అంశాలకు సంబంధించి తనకు పూర్తి వివరాలు తెలియవని రావణ్ సమాధానాలను దాటవేసినట్లు సమాచారం.
ఛానల్ నిర్వహణలో గమన, ఇంద్రసేనానాయుడి పాత్రలపైనా పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. గమన పరిపాలనా వ్యవహారాలు చూసుకునేవారని, ఛానల్ కార్యాలయం ఉన్న ప్రాంగణాన్ని ఇంద్రసేన నుంచి తీసుకున్నామని రావణ్ చెప్పినట్లు సమాచారం.
అలాగే వైకాపా నేతలతో తనకు ఉన్న సంబంధాలు, ఛానల్‌లో కథనాల ఎంపికలో వారి ప్రమేయం తదితర అంశాలపై కూడా పోలీసులు పలుమార్లు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు రావణ్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు సమాచారం. ఈ కేసులో ఛానల్ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, వీడియోల రూపకల్పనకు సంబంధించిన అంశాలపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















