అమెరికా అధ్యక్షుడు Donald Trump, అమెరికా రక్షణశాఖ (పెంటగాన్) డిమాండ్లను తిరస్కరించిన ఏఐ స్టార్టప్ Anthropicతో ఇకపై వ్యాపార సంబంధాలు కొనసాగించబోమని ప్రకటించడం అంతర్జాతీయ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన ‘క్లాడ్’ ఏఐ మోడళ్లను సైనిక, నిఘా కార్యకలాపాల్లో అపరిమితంగా వినియోగించుకునేలా యాక్సెస్ ఇవ్వాలని పెంటగాన్ కోరగా, అది ప్రజాస్వామ్య విధానాలు మరియు నైతిక ప్రమాణాలకు విరుద్ధమని ఆంథ్రోపిక్ సీఈఓ Dario Amodei స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆ సంస్థ టెక్నాలజీ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదే సమయంలో ఆంథ్రోపిక్‌కు ప్రధాన ప్రత్యర్థి సంస్థ అయిన OpenAIతో పెంటగాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ సీఈఓ Sam Altman వెల్లడించారు. ఏఐను బాధ్యతాయుతంగా, పరిమితులలో వినియోగించేలా సాంకేతిక నియంత్రణలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు, నైతిక ప్రమాణాల పరిధిలోనే ఏఐ మోడళ్లు పనిచేస్తాయని భరోసా ఇచ్చారు.
మరోవైపు, బెదిరింపులు వచ్చినా తమ విధానాల్లో మార్పు ఉండదని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది. మిలిటరీ, నిఘా రంగాల్లో అపరిమిత ఏఐ వినియోగం ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పు కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం, నైతికత, ప్రభుత్వ నియంత్రణలపై మరింత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సు పాత్ర ఎంతవరకు ఉండాలి? దాని వినియోగానికి ఎలాంటి పరిమితులు అవసరం? అనే అంశాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నా
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















