ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పేపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలు జరగని వాలెట్‌లపై నిర్వహణ ఛార్జీలు వసూలు చేస్తామంటూ సంస్థ వినియోగదారులకు సందేశాలు పంపిస్తోంది. దీనిపై యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలెట్ ఉండడమే తప్పా? దాన్ని వాడకపోతే కూడా ఛార్జీలు ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫోన్‌పే నుంచి వచ్చిన మెసేజ్‌లను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఏమిటీ ఈ ఫీజు?
ఫోన్‌పే ప్రకారం, ఏడాది పాటు ఎలాంటి డిజిటల్ చెల్లింపులు జరపని వాలెట్‌లను “ఇనాక్టివ్ వాలెట్”గా పరిగణించి, వాటిపై నిర్వహణ ఛార్జీలు విధించనుంది. ఈ కింద ప్రతి మూడు నెలలకు రూ.100 చొప్పున ఫీజు వసూలు చేస్తామని సందేశాల్లో పేర్కొంది.
ఈ విధానాన్ని తమ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఇప్పటికే పేర్కొన్నట్లు కంపెనీ చెబుతోంది. అయితే ఫీజు ఎంతకాలం వసూలు చేస్తారన్న విషయంపై స్పష్టత లేదని వినియోగదారులు అంటున్నారు. 15 రోజుల ముందుగా నోటిఫికేషన్ ఇస్తామని, ఆ సమయంలో వాలెట్‌ను యాక్టివ్ చేసుకుంటే ఛార్జీలు తప్పించుకోవచ్చని కంపెనీ తెలిపింది. యాప్ వాడటం మాత్రమే వాలెట్ యాక్టివ్‌గా పరిగణించబడదని కూడా స్పష్టం చేసింది. వసూలు చేసిన ఛార్జీలను కంపెనీ నిర్వహణ ఖర్చుల కోసం వినియోగిస్తామని పేర్కొంది.
యూజర్ల ఆగ్రహం
ఫోన్‌పే వంటి యాప్‌లు రోజువారీ జీవితంలో భాగమయ్యాయని, ముఖ్యంగా యూపీఐ చెల్లింపులు విస్తృతంగా జరుగుతున్నాయని యూజర్లు చెబుతున్నారు. అయితే చాలామంది వాలెట్ ఫీచర్‌ను ఉపయోగించకపోయినా, అకౌంట్ ఉండడం వల్ల ఛార్జీలు వేయడం అన్యాయమని అభిప్రాయపడుతున్నారు. ఇది “దోపిడీలా” ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ను ట్యాగ్ చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















