మోసం, ద్వేషమే కాదు.. కపటస్వభావాన్ని కూడా వ్యతిరేకించాయి మన ఆధ్యాత్మిక గ్రంథాలు. అలాంటి గుణాన్ని వదిలించుకోవాలని, కల్మషం లేకుండా నిర్మలంగా ఉండాలని, అనేక సందర్భాల్లో తెలియజేశారు. చిన్నారులు అలా ఉంటారు కాబట్టే వాళ్లని దైవంతో సమానమని పెద్దలు చెబుతుంటారు. ఆ సద్గుణాన్ని బాల్యంలో వదిలేయక.. ఎప్పటికీ నిలబెట్టుకోవాలని, అలాంటి వ్యక్తులతో నిండిన నేల ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుందని చెబుతూ.. ముందు తరాల వారికి అది సులభంగా అర్థమవ్వాలని కథల రూపంలో తెలియజేశారు కవిపండితులు. వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం మహాకావ్యంలోని రుష్యశృంగుడి కథ అటువంటిదే.
కశ్యప మహర్షి మనవడు రుష్యశృంగుడు. నిరంతరం వేదాధ్యయనం చేసేవాడు. అడవిలో సంచరిస్తూ తపస్సు చేసుకుంటున్న తండ్రికి సపర్యలు చేయడంలో ఆయన ఆనందాన్ని అనుభవించేవాడు. తన తండ్రిని కలిసేందుకు వచ్చే రుషులు తప్ప అతడికి వేరే ప్రపంచం తెలియదు. స్త్రీల స్వరూప స్వభావాలు గానీ, ఇంద్రియ సుఖాలు గానీ అతడికి పరిచయం లేదు. సదా పితృసేవలోనే కాలం గడిపేవాడు. అదంతా అతడికి కేవలం కర్తవ్యనిర్వహణలా కాకుండా గొప్ప వ్యాపకంలా తోచేది. రుష్యశృంగుడు ఎన్నడూ ఆశ్రమాన్ని విడిచి బయటకు వెళ్లింది లేదు. ఇంద్రియాలను జయించినవాడై, ఎప్పుడూ స్వచ్ఛమైన అంతరంగంతో, ప్రశాంతంగా, సంతోషంగా ఉండేవాడు. అలాంటి రుష్యశృంగుణ్ణి సాటి మునులందరూ దైవత్వం నిండిన వ్యక్తిగా భావించేవారు.
పరాక్రమవంతుడైన రోమపాదుడు అంగదేశాన్ని పాలిస్తున్నాడు. ధర్మాన్ని సరిగా అనుసరించకపోవడం వల్ల అకస్మాత్తుగా రాజ్యంలో అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. అలాంటి పరిస్థితిలో మంత్రులను, వేదపండితులను పిలిచి తరుణోపాయం అడిగాడు రోమపాదుడు. వారు దీర్ఘంగా ఆలోచించి.. తపస్సు చేసుకుంటున్న తండ్రిని కనిపెట్టుకుని ఉండి ఆయనకు సేవచేస్తూ.. ధ్యానం, వేదాధ్యయనాలతో కాలం గడుపుతున్న రుష్యశృంగుణ్ణి రాజ్యంలోకి పిలిపించమన్నారు. అతడికి రోమపాదుడి పుత్రిక శాంతతో వివాహం చేయమని, అలా పెళ్లి చేయడం ద్వారా రుష్యశృంగుడు రాజ్యంలో శాశ్వతంగా ఉండేట్లు చేస్తే.. కరవుకాటకాలు సమసిపోయి ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని రాజుకి చెప్పారు. రోమపాదుడు వారి సలహా ప్రకారం రుష్యుశృంగుణ్ణి ప్రయాసతో ఒప్పించి, తన రాజ్యంలోకి రప్పించాడు. ధర్మబద్ధుడు, నిష్కపటి అయిన రుష్యశృంగుడు- రోమపాదుడి రాజ్యంలో అడుగు పెట్టగానే వర్షాలు కురిశాయి. దేశం సుభిక్షమైంది. ప్రజలు ఆనందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















