టీమ్‌ఇండియా టీ20 జట్టులో నాయకత్వ మార్పు చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్షన్ కమిటీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పేలవ బ్యాటింగ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న “స్కై”ను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా సూర్య ఫామ్ అందుకుంటాడని బీసీసీఐ ఎదురుచూస్తున్నప్పటికీ, ఆటతీరులో పెద్దగా మెరుగుదల కనిపించకపోవడం ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును విజయతీరాలకు నడిపించినప్పటికీ, వ్యక్తిగత ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం అతనికి ప్రతికూలంగా మారింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026లో మంచి ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకుని, అతనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు సూచిస్తున్నాయి. శ్రేయస్ ప్రస్తుతం తన జట్టుకు నాయకత్వం వహిస్తూ అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నాడు.
ఐపీఎల్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 195 పరుగులు మాత్రమే చేయగా, శ్రేయస్ అయ్యర్ 9 ఇన్నింగ్స్‌ల్లో 333 పరుగులతో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని సారథ్యంలో జట్టు కూడా మంచి విజయాలను నమోదు చేసింది.
జూన్ చివర్లో ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్, జూలైలో ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశమై కెప్టెన్సీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















