సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
38 ఏళ్ల ప్రతీక్ యాదవ్ కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. దీనికి చికిత్స కూడా కొనసాగుతున్నప్పటికీ, అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.పోలీసుల ప్రాథమిక విచారణలో ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడైంది. అయితే ఇటీవల భార్య అపర్ణ యాదవ్‌తో తీవ్ర విభేదాలు నెలకొన్నాయని వార్తలు వచ్చాయి. కుటుంబ బంధాలను ఆమె దెబ్బతీసిందంటూ ప్రతీక్ జనవరిలో చేసిన సోషల్ మీడియా పోస్టులు అప్పట్లో సంచలనంగా మారాయి. విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు కూడా ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
ప్రతీక్ యాదవ్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆయన భార్య అపర్ణ యాదవ్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తర్‌ప్రదేశ్ మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.ప్రతీక్ మృతిపై మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వ్యక్తి అని, స్వయంకృషితో ఎదగాలని భావించేవాడని గుర్తుచేసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















