వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారని చెప్పారు.
ప్రియాంక మృతి ఘటనను ప్రత్యేక కేసుగా పరిగణించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆమె తండ్రి వెంకటేశ్ కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.
ఈ ఘటన చాలా బాధాకరమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన శిక్ష పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పారు. ఘటనకు సంబంధించిన వివరాలు తొలుత ఎందుకు బయటకు రాలేదనే అంశంపైనా విచారణ జరుపుతామని వెల్లడించారు.
తెదేపా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ.. కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుమారు రెండు గంటలపాటు సమీక్షించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆస్పత్రి ఖర్చులు, రూ.20 లక్షల పరిహారం అందించిందని చెప్పారు.
భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కె నాగేంద్ర మాట్లాడుతూ.. ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, నిందితులు తప్పించుకోకుండా పకడ్బందీ ఆధారాలు సేకరిస్తున్నారని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















