ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో ఈడీ, సీబీఐ దర్యాప్తు నివేదికలను అలహాబాద్ హైకోర్టులో సమర్పించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే వరకు కేసును ముందుకు తీసుకెళ్లవద్దని అలహాబాద్ హైకోర్టుకు సూచించింది.
ఈ కేసులో ఆగస్టు 20న జరగాల్సిన తదుపరి విచారణను కూడా వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు ఇంత తీవ్రంగా ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తే.. ఇన్నాళ్లుగా ఎందుకు మౌనం వహించాయని ధర్మాసనం ప్రశ్నించింది.
కర్ణాటకకు చెందిన భాజపా నేత చేసిన ఫిర్యాదు ఆధారంగా రాహుల్ గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు.. ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఈడీ, సీబీఐలను ఆదేశించింది.
అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తదుపరి విచారణ వరకు దర్యాప్తు నివేదికను హైకోర్టులో సమర్పించవద్దని ఈడీ, సీబీఐలను ఆదేశిస్తూ.. అలహాబాద్ హైకోర్టు విచారణను వాయిదా వేయాలని సూచించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















