ఫ్రాన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన రాబోయే భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ (Varanasi) గురించి కీలక అప్‌డేట్‌ను పంచుకున్నారు. మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘వారణాసి’ చిత్రం అక్టోబర్‌లో పూర్తవుతుందని పేర్కొన్న రాజమౌళి, తాజా వ్యాఖ్యల్లో చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు వెల్లడించారు. “నా నిర్మాతలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పలేను. కానీ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. మిగిలిన చిన్న సన్నివేశాలను వచ్చే 80 రోజుల్లో పూర్తి చేస్తాం” అని ఆయన అన్నారు. సెప్టెంబర్‌లోనే మొత్తం షూటింగ్ ముగించాలని ప్రణాళిక వేసినట్లు తెలిపారు. దీంతో మహేశ్ బాబు అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.
ఇదే కార్యక్రమంలో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో తన అనుబంధాన్ని కూడా రాజమౌళి పంచుకున్నారు. మొదటిసారి ఆయనను చూసినప్పుడు ఆశ్చర్యంతో నిలిచిపోయినట్లు తెలిపారు. అలాగే జేమ్స్ కామెరూన్ ‘ఆర్ఆర్ఆర్’ను రెండుసార్లు చూశానని చెప్పినప్పుడు తనకు ఎంతో ఆనందం కలిగిందని వెల్లడించారు.
సినిమా నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై జరిగిన చర్చను కూడా ఆయన ప్రస్తావించారు. ఏఐ వినియోగం కొంత ఆందోళన కలిగించినప్పటికీ, దర్శకుల సృజనాత్మకతను ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని జేమ్స్ కామెరూన్ తనతో చెప్పారని రాజమౌళి వెల్లడించారు. ఆ మాటలు తనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని ఆయన తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















