రజనీకాంత్ నటిస్తున్న 173వ చిత్రం ‘ధర్మన్’ అధికారికంగా టైటిల్, ఫస్ట్ లుక్‌తో చెన్నైలో ఘనంగా ఆవిష్కరించబడింది. ఈ చిత్రానికి ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ఉపశీర్షికను ఖరారు చేశారు. న్యాయాన్ని గెలిపించే ఓ వైద్యుడి పాత్రలో రజనీకాంత్ కనిపించనున్నారని సమాచారం.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా, కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సిమ్రన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు.
చెన్నైలో జరిగిన టైటిల్, లుక్ విడుదల వేడుకలో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనపై వస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ, తాను ఏం మాట్లాడినా వివాదంగా మారుతోందని, మాట్లాడకపోయినా ప్రశ్నలు ఎదురవుతున్నాయని అన్నారు. “మనల్ని ఇష్టపడనివాళ్లకు మనం ఏం చేసినా నచ్చదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సినిమా ప్రాజెక్ట్ మొదట కొందరు దర్శకులతో చర్చల దశలో వెళ్లినా, చివరకు అశ్వత్ మారిముత్తు వద్దకు చేరిందని రజనీ తెలిపారు. కమల్ హాసన్ సహకారం, ప్రోత్సాహాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















