అమరావతి – వంగవీటి రంగాను రౌడీ అంటూ దూషించి, ఆయనను చంపితే తప్పేంటని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత గౌతమ్‌రెడ్డికి ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన చరిత్ర జగన్‌రెడ్డిదేనని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రంగ హత్య కేసు నిందితులు నేడు వైకాపాలో ఉండి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన నిమ్మల, పేరు చివర ‘రెడ్డి’ని చేర్చుకున్న ముద్రగడ పద్మనాభం కాపుల గురించి మాట్లాడటం విడ్డూరమని వ్యాఖ్యానించారు. జగన్‌ను మెప్పించేందుకే ఆయన తన స్థాయిని తగ్గించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లను అధికారంలోకి రాగానే జగన్ రద్దు చేశారని నిమ్మల గుర్తుచేశారు. అలాగే చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
వైకాపా హయాంలో సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెట్టినా జైలుకు పంపిన జగన్, నేడు ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిపై పార్టీ పరంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాంబాబును పావుగా వాడుకుంటున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















