రవిబాబు దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రేజర్’ ఒక డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిధ్యభరితమైన కథలతో ఎప్పుడూ ప్రత్యేకత చూపించే రవిబాబు, ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కూడా నటించారు. మే 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే, విష్ణు (తనీష్) సీసీ కెమెరాల కంపెనీ నిర్వహిస్తుంటాడు. అతని కుటుంబమే అతని ప్రపంచం—భార్య లక్ష్మి, కూతురు తేజు. అయితే అతను ఏర్పాటు చేసిన ఒక సీసీ కెమెరాలో ముఖ్యమంత్రి హత్యకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అవుతాయి. సీఎం పదవిని ఆశించిన హోం మంత్రి ఈ హత్యకు పాల్పడతాడు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సీసీ కెమెరాలో ఆధారాలు రికార్డు కావడంతో అతను విష్ణును లక్ష్యంగా చేసుకుంటాడు.
తర్వాత విష్ణును హత్య చేయిస్తాడు. అయితే కీలకమైన విజువల్స్ మాత్రం హోం మంత్రి గ్యాంగ్‌కు దొరకకుండా దాచబడతాయి. ఇదే సమయంలో తండ్రి హత్యను ప్రత్యక్షంగా చూసిన చిన్నారి తేజు ప్రమాదకర పరిస్థితిలో పడుతుంది.
ఈ పరిస్థితుల్లో కుక్కల సంరక్షకుడిగా పనిచేసే రేజర్ (రవిబాబు) ఆ చిన్నారిని రక్షించే బాధ్యత తీసుకుంటాడు. అసలు రేజర్ నేపథ్యం ఏమిటి? అతనికి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? హోం మంత్రి గ్యాంగ్ నుంచి తేజును ఎలా కాపాడాడు? అలాగే కథలో రుద్ర పాత్ర ఎవరిది? అనే అంశాలు సినిమా మిగతా భాగంలో ఉత్కంఠగా కొనసాగుతాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















