విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద రూ.2,424.44 కోట్ల ఉల్లంఘనలకు సంబంధించి అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాఫీతో కూడిన కాంపౌండింగ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సంస్థ చేసిన ఉల్లంఘనలను మాఫీ చేస్తూ, వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ.17.76 కోట్ల జరిమానా విధించింది.
అదే విధంగా సంస్థకు చెందిన డైరెక్టర్లు/ఆఫీసర్లు ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి, ఎస్‌కె వెంకటరామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్‌ఎం కృష్ణన్‌లకు ఒక్కొక్కరికి రూ.18 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఈ వివరాలను వెల్లడించింది. ఫెమా చట్టంలోని సెక్షన్ 15 కింద ఉన్న ఉల్లంఘనలపై అపోలో హాస్పిటల్స్ మాఫీ కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.
ఆర్‌బీఐ నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత చట్ట నిబంధనలకు అనుగుణంగా మాఫీకి అభ్యంతరం లేదని ఈడీ తెలిపినట్లు సమాచారం. దీంతో సంబంధిత ఉల్లంఘనలపై కొనసాగుతున్న న్యాయ ప్రక్రియ కూడా ముగిసినట్లు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















