మస్కట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్ శుక్రవారం క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఉపాధి కోసం ఒమన్‌లోని మస్కట్ వెళ్లిన ఆమె, అక్కడ తన యజమాని (సేఠ్) వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె కన్నీటితో చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో “పవనన్నా.. నన్ను చంపేస్తారన్నా.. ప్లీజ్ కాపాడన్నా” అంటూ సహాయం కోరడం వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై ఆదివారం ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైన వెంటనే మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆమెను సురక్షితంగా భారత్‌కు రప్పించే చర్యలు తీసుకుంటామని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దీంతో విదేశీ వ్యవహారాల శాఖ, ఒమన్‌లోని భారత ఎంబసీ అధికారులు రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టారు.
శుక్రవారం స్వదేశానికి చేరుకున్న షానల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో జనసేన నాయకులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ఆమెను వాల్మీకిపురానికి తరలించారు.
ఈ ఘటనలో సహకరించిన విదేశీ మంత్రిత్వ శాఖ, ఒమన్‌లోని భారత ఎంబసీ అధికారులు, ఒమన్ ప్రభుత్వ యంత్రాంగానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మహిళ సమస్య తన దృష్టికి రాగానే విదేశీ మంత్రిత్వ శాఖను సంప్రదించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. సహకరించిన జనసేన గల్ఫ్ క్యాడర్‌ను కూడా ఆయన అభినందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















