బియ్యం కడిగిన నీటిలో స్టార్చ్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి అనేక సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు మట్టిలోని ఉరాన్ని పెంచి మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పిండి పదార్థాలు మొక్కల వేర్లకు బలం ఇచ్చి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.ఈ నీటిని ఆకుకూరల మొక్కలకు పోస్తే అవి గుబురుగా, పచ్చగా పెరుగుతాయి. ఇంట్లో పెంచుకునే టమాటా మొక్కలకు కూడా ఇది మంచి ఎరువులా పనిచేస్తుంది. దీంతో మొక్కలకు పూతలు, కాయలు బాగా వస్తాయి. అలాగే మిరప మొక్కలు కూడా బలంగా పెరిగి మంచి దిగుబడి ఇస్తాయి.
మొక్కల ఆకులపై బూజు లేదా ఇతర తెగుళ్లు కనిపిస్తే బియ్యం కడిగిన నీటిని నేరుగా ఆకులపై స్ప్రే చేయవచ్చు. ఇలా రెండు వారాలకు ఒకసారి చేయడం వల్ల ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, ఈ నీటిని 3 నుంచి 9 రోజులు పులియబెట్టితే ఇందులోని పోషకాలు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
బియ్యం కడిగిన నీళ్లే కాకుండా గంజిని కూడా మొక్కలకు ఎరువులా ఉపయోగించవచ్చు. అయితే దాన్ని నేరుగా కాకుండా 1:2 నిష్పత్తిలో నీటితో కలిపి మొక్కలకు పోయాలి. కానీ హైడ్రోపోనిక్ విధానంలో పెంచే మొక్కలకు ఈ నీటిని ఉపయోగించకూడదు. ఇందులో ఉండే స్టార్చ్ కారణంగా బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరిగే అవకాశం ఉండటంతో ఆ విధానంలో ఉన్న మొక్కలకు ఇది అనుకూలం కాదని నిపుణులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















