చెన్నై సూపర్ కింగ్స్ కొత్త ప్రధాన కోచ్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జట్టుకు సుదీర్ఘకాలం హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలిగి దాదాపు రెండు నెలలు గడిచినా.. ఇప్పటివరకు కొత్త కోచ్ పేరును సీఎస్‌కే అధికారికంగా ప్రకటించలేదు. పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. తుది నిర్ణయంపై స్పష్టత రాలేదు. వచ్చే వారంలో కోచ్ ఎంపికపై ఫ్రాంచైజీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోని మేనేజ్‌మెంట్ ముందు రెండు కీలక షరతులు పెట్టినట్లు సమాచారం. కొత్తగా బాధ్యతలు చేపట్టే ప్రధాన కోచ్ భారత్‌కు చెందిన వ్యక్తే అయి ఉండాలని.. సపోర్ట్ స్టాఫ్‌లోనూ ఎక్కువగా భారతీయులకే ప్రాధాన్యం ఇవ్వాలని ధోని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్న మైక్ హస్సీకి హెడ్ కోచ్ అవకాశం దక్కుతుందన్న అంచనాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇక రెండో షరతుగా.. కొత్త హెడ్ కోచ్ కేవలం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే పనిచేయాలని ధోని కోరినట్లు సమాచారం. ఫ్రాంచైజీకి చెందిన ఇతర లీగ్ జట్లతో కోచింగ్ బాధ్యతలు చేపట్టకూడదనేది ఈ నిబంధనగా తెలుస్తోంది. గతంలో ఫ్లెమింగ్ జోహెన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లకూ కోచింగ్ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ రెండు షరతుల నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. భారతీయుడైన బదానీకి కోచింగ్ అనుభవం ఉండటంతో పాటు ధోనితోనూ మంచి సంబంధాలు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎస్‌కే మేనేజ్‌మెంట్ చివరకు ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















