Election Commission of India జూన్ 18న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి ముగ్గురు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అలాగే ఝార్ఖండ్ నుంచి ఇద్దరు, అరుణాచల్‌ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల నుంచి ఒక్కో సభ్యుని పదవీకాలం ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి పదవీ విరమణ చేయనున్న వారిలో వైకాపాకు చెందిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్‌చంద్రబోస్, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ ఉన్నారు. కర్ణాటక నుంచి మాజీ ప్రధాని H. D. Deve Gowda, కాంగ్రెస్ అధ్యక్షుడు Mallikarjun Kharge, మధ్యప్రదేశ్ నుంచి Digvijaya Singh తదితరుల పదవీకాలం కూడా ముగియనుంది.
జూన్ నెలాఖరుకు ఖాళీ కానున్న 24 స్థానాల్లో భాజపాకు చెందిన 12 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు 4, వైకాపాకు 3 స్థానాలు ఉండగా, ఎన్‌పీపీ, జేడీఎస్, ఎంఎన్‌ఎఫ్, ఎన్‌సీపీ, ఏఐడీఎంకే, జేఎంఎం, తెదేపా పార్టీలకు ఒక్కో సభ్యుడు ఉన్నారు.
ఇక మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో అజిత్‌పవార్ సతీమణి సునేత్ర పవార్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో రాజీనామా చేశారు. అలాగే తమిళనాడులో ఏఐఏడీఎంకే నేత సీవే షణ్ముగం అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నిక కావడంతో రాజ్యసభ స్థానాన్ని వీడారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















