దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Samsung తన వార్షిక మెగా ఈవెంట్‌కు సిద్ధమైందిశాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 2026 పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25న జరగనుంది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎస్26 Samsung Galaxy S26aలను అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ ఫోన్ల కోసం ప్రీ–రిజర్వేషన్లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఈ మెగా ఈవెంట్‌ను అమెరికాలోని San Francisco నగరంలో నిర్వహించనున్నారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం, భారత్‌లో రాత్రి 11:30 గంటలకు మొదలవుతుంది. అభిమానులు ఈ కార్యక్రమాన్ని Samsung అధికారిక వెబ్‌సైట్, Samsung Newsroom, అలాగే YouTube ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
అదనంగా, రూ.999 చెల్లించి Galaxy Pre-Reserve VIP Pass తీసుకునే వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనం కల్పిస్తున్నారు. ఈ పాస్‌తో కొత్త గెలాక్సీ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో సుమారు ₹5,000 విలువైన ఈ-స్టోర్ వోచర్ పొందే అవకాశం ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే, ఎస్26 సిరీస్‌లో మూడు మోడళ్లను కంపెనీ విడుదల చేయనుంది. తదుపరి తరం టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫోన్లలో అధునాతన AI ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ పనులను సులభతరం చేసే స్మార్ట్ ఫీచర్లు, మెరుగైన పనితీరు, శక్తివంతమైన కెమెరా సామర్థ్యాలతో ఈ ఫోన్లు రావొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక స్మార్ట్‌ఫోన్లతో పాటు Samsung Galaxy Buds 4 మరియు Samsung Galaxy Buds 4 Pro వంటి కొత్త ఆడియో పరికరాలను కూడా ఈ ఈవెంట్‌లో పరిచయం చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా, గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ టెక్ ప్రపంచంలో మరో భారీ సంచలనంగా నిలవనుందని భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















