కులాంతర వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదన్న కారణంతో వారిని మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసిన యువతి.. తాజాగా అదే తరహాలో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌లో సోమవారం చోటుచేసుకుంది.
యాచారానికి చెందిన నక్కలి దశరథం(58), లక్ష్మి(54) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె సురేఖ(25) మినహా మిగిలిన వారికి వివాహాలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సురేఖ నర్సుగా పనిచేస్తోంది.
ఏడాది కిందట సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలానికి చెందిన ఓ డ్రైవర్ ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని సురేఖ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కులాలు వేరు కావడంతో వివాహానికి తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. మరోవైపు ఆమెకు వివాహ సంబంధాలు చూడటం ప్రారంభించారు.
దీంతో తల్లిదండ్రులు తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారని భావించిన సురేఖ వారిని హత్య చేసేందుకు పథకం వేసింది. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి తల్లిదండ్రులను హతమార్చినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారు అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సురేఖను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొన్ని రోజుల క్రితం ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. అనంతరం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది.
ఈ క్రమంలో సోమవారం ఉదయం సురేఖ ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను హత్య చేసేందుకు ఉపయోగించిన తరహాలోనే మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారంతో ప్రారంభమైన ఈ ఘటన చివరకు ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















