కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్‌బాబు, ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీ నరసింహమూర్తి హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, వాటి వినియోగం, రాష్ట్రాల అవసరాలపై కమిటీ చర్చిస్తోంది.
ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా జలాలను విడుదల చేయాలన్న ఏపీ విజ్ఞప్తిపై సమావేశంలో చర్చ జరుగుతోంది. నీటి లభ్యత, ప్రస్తుత అవసరాలు, రిజర్వాయర్లలోని నిల్వలు, ఆయా ప్రాంతాలకు అవసరమైన నీటి పరిమాణంపై అధికారులు సమీక్షిస్తున్నారు.
తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీని సమావేశపర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. దీంతో తొలుత ఈ నెల 13న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం భేటీని 17వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఏపీ శాసనసభ సమావేశాల నేపథ్యంలో మరోసారి వాయిదా పడటంతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు తమ అవసరాలు, నీటి లభ్యతకు సంబంధించిన అంశాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. త్రిసభ్య కమిటీ చర్చల అనంతరం తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















