అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇవాళ తెల్లవారుజామున దుండగులు ఏటీఎం కేంద్రంపై దాడి చేసి యంత్రాన్ని ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు.
సమాచారం అందిన కొద్ది గంటల్లోనే దుండగులు తీసుకెళ్లిన ఏటీఎం సామగ్రిని శింగనమల మండలం ఆకులేడు శివారులో పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాడిపత్రి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం గది అద్దాలను పగలగొట్టి యంత్రం, బ్యాటరీలను అపహరించినట్లు గుర్తించారు.
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, ఏటీఎం నుంచి సుమారు వంద మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం స్థానికంగా ఆందోళన కలిగించింది.
సమాచారం తెలుసుకున్న వెంటనే డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ సుబ్బరాయుడు, ఎస్సై రాంప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించడంతో పాటు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
దుండగులు వదిలేసిన ఏటీఎం భాగాలను కూడా ఆకులేడు గ్రామ పరిధిలో గుర్తించినట్లు సమాచారం. అక్కడ కూడా ఆధారాల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి.
చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















