ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌పై కీలక సమాచారం వెలుగులోకి వస్తోంది. దేశంలో దాదాపు 30 శాతం మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్న ఈ ప్రాంతాన్ని ఎర్ర కోటగా పిలుస్తారు. ఇటీవల కేంద్రం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ మార్చి 31తో ముగిసినా, భద్రతా బలగాలు అడవుల్లో నిరంతరం సోదాలు కొనసాగిస్తున్నాయి.
ఈ సోదాల్లో రహస్యంగా దాచిన డంప్‌ల నుంచి భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. గత మూడు నెలల్లోనే సుమారు రూ.6.75 కోట్ల నగదు, అలాగే 8 కిలోల బంగారం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా.
దీంతో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల రహస్య సంపద రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా బలగాలు ఇంకా అనేక రహస్య డంప్‌లను వెలికితీసే ప్రయత్నాల్లో ఉన్నాయి.
అడవుల్లో దాచిన పేలుడు పదార్థాలు గుర్తించేందుకు డీ-మైనింగ్ ఆపరేషన్లు కూడా కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. మావోయిస్టుల లాజిస్టిక్ నెట్‌వర్క్‌ను పూర్తిగా విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















