నేటి పోటీ ప్రపంచంలో అనేక మంది విద్యార్థులు, యువతకు మంచి సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ధైర్యం తగ్గిపోతుంది. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు వెనుకడుగు వేస్తారు. కానీ విజయం సాధించాలంటే కేవలం బాహ్య శక్తి కాకుండా అంతర్గత మనోబలం ఎంతో అవసరం. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం ఉన్నప్పుడు ఏ లక్ష్యాన్నైనా సులభంగా చేరుకోవచ్చు. ఈ లక్షణాలు ఉన్నవారు కష్టకాలంలో కూడా ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు.
స్వీయ అవగాహన
లక్ష్య సాధనలో ముఖ్యమైన అంశం స్వీయ అవగాహన. అంటే మన బలాలు, బలహీనతలు, భావోద్వేగాలు, ఆలోచనల గురించి తెలుసుకోవడం. మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. మన విలువలకు కట్టుబడి బాధ్యతతో ముందుకు సాగగలుగుతాం. మానసికంగా ఆనందంగా ఉండే వాతావరణంలో ఉండటం, మంచి వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం అవసరం. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, సరైన విశ్రాంతి తీసుకోవడం ఇవన్నీ మన శారీరక-మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి.
సవాళ్లను స్వీకరించడం
సవాళ్లు మన అభివృద్ధికి దారి తీసే అవకాశాలు. అడ్డంకులు వచ్చినప్పుడు వాటిని తప్పించుకోవడం కాకుండా ఎదుర్కోవాలి. వైఫల్యాలు కూడా మనకు విలువైన పాఠాలు నేర్పుతాయి. కష్టాలు ఎదురైనప్పుడు భయపడకుండా పట్టుదలతో ముందుకు సాగితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం.
క్రమశిక్షణ
విద్యార్థులు, ఉద్యోగార్థులు అందరూ స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలి. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు ప్రణాళిక రూపొందించాలి. ప్రతిరోజూ ఆ ప్రణాళికను అమలు చేస్తూ ముందుకు సాగాలి. విజయాలు, పరాజయాలు రెండూ సాధనలో భాగమే. ఆశించిన ఫలితం రాకపోయినా నిరుత్సాహపడకుండా భావోద్వేగ పరిపక్వతతో ముందుకు సాగాలి. మంచి స్నేహితులు, మంచి వాతావరణం మన భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
స్వశక్తిపై నమ్మకం
లక్ష్య సాధనలో అత్యంత ముఖ్యమైనది మన మీద మనకు నమ్మకం కలిగి ఉండటం. మనల్ని మనం విశ్వసించినప్పుడే విజయాన్ని అందుకోవచ్చు. ఎప్పుడైనా సందేహం కలిగితే గతంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించడం ద్వారా మనపై మనకు విశ్వాసం మరింత పెరుగుతుంది.
సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం
ఒక పనిని చేయాలనే ఆసక్తితో ముందడుగు వేస్తే అనుభవం లేకపోయినా క్రమంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడం ఎంతో ముఖ్యం. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త సవాళ్లను స్వీకరించాలి. నైపుణ్యాలపై సాధన పెంచుకుంటే మన సామర్థ్యాలపై విశ్వాసం కూడా పెరుగుతుంది.మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ప్రతికూల ఆలోచనలు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. అందుకే ఆశావహ దృక్పథంతో ఉండటం, కృతజ్ఞత భావాన్ని పెంపొందించుకోవడం, సమస్యల కంటే పరిష్కారాలపై దృష్టి పెట్టడం ద్వారా సానుకూల మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNow WorldNews

















