మెటా కొత్తగా మరో సీఈఓను తీసుకురాబోతోందన్న వార్తలు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ప్రస్తుత సీఈఓ Mark Zuckerbergకు పోటీగా సంస్థలో కొత్త నాయకత్వ మార్పు జరగబోతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఇది నిజమైన సీఈఓ మార్పు కాదని, మెటా కృత్రిమ మేధ (AI) ఆధారిత భారీ ప్రాజెక్ట్‌లో భాగంగా జరుగుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
Meta Platforms ఇప్పటికే AI రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు రియల్ టైమ్ కమ్యూనికేషన్ కోసం ఫొటోరియలిస్టిక్, 3D AI క్యారెక్టర్లను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా జుకర్‌బర్గ్ హావభావాలు, గొంతు, మాట్లాడే శైలిని అనుకరించే “AI Zuckerberg”ను రూపొందిస్తున్నట్లు సమాచారంఈ AI వెర్షన్‌కు శిక్షణ, టెస్టింగ్ పనుల్లో కూడా జుకర్‌బర్గ్ స్వయంగా పాల్గొంటున్నారని, వారానికి 5–10 గంటలు దీనికోసం కేటాయిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా “CEO Agent” అనే ప్రాజెక్ట్ ద్వారా సమాచారాన్ని వేగంగా విశ్లేషించే AI సహాయక వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తున్నారు.
ఓపెన్‌ఏఐ, గూగుల్ వంటి సంస్థలతో పోటీగా “పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్” లక్ష్యంతో మెటా ముందుకు సాగుతోంది. ఉద్యోగుల్లో AI టూల్స్ వినియోగాన్ని పెంచుతూ పనితీరు పరీక్షలు కూడా నిర్వహిస్తోంది.ఇక ఇటీవల రియాలిటీ ల్యాబ్స్, సేల్స్, రిక్రూటింగ్, ఫేస్‌బుక్ విభాగాల్లో 700 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు వచ్చిన వార్తలు ఈ మార్పులపై మరింత చర్చకు దారి తీస్తున్నాయి. అయితే ఇవన్నీ పునర్వ్యవస్థీకరణలో భాగమేనని మెటా చెబుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















