పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల నుంచి టోల్ ఫీజులు వసూలు చేస్తున్నట్టు సంచలన సమాచారం బయటకు వచ్చింది. షిప్పింగ్ రంగానికి చెందిన అంతర్జాతీయ వెబ్‌సైట్ లాయిడ్స్‌లిస్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఆధ్వర్యంలో టోల్ బూత్ వ్యవస్థను అమలు చేస్తున్నట్టు సమాచారం. మార్చి 13 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 26 నౌకలు ఈ ఫీజులు చెల్లించి హర్మూజ్ జలసంధిని దాటినట్టు వెల్లడైంది. ఫీజులు చెల్లించిన నౌకలు ప్రత్యేక క్లియరెన్స్ కోడ్‌లు తీసుకుని, ఇరాన్ సూచించిన మార్గాల్లోనే ప్రయాణిస్తున్నాయి. సాధారణంగా ఉపయోగించే సముద్ర మార్గాల్లో ప్రయాణం తగ్గిపోయిందని ట్రాకింగ్ డేటా సూచిస్తోంది.
ఇక భారత్‌కు సంబంధించిన నౌకల విషయానికి వస్తే, ఇటీవల ఐదు నౌకలు సురక్షితంగా హర్మూజ్ దాటినట్టు సమాచారం. వీటిలో కొన్ని ఇప్పటికే భారత పోర్టులకు చేరుకోగా, మరికొన్ని త్వరలో చేరనున్నాయి. అయితే, ఈ నౌకలు టోల్ చెల్లించాయా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.మరోవైపు, నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారనే వార్తలను ఇరాన్ ప్రభుత్వం గతంలో ఖండించింది. భారత్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయం కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అయినప్పటికీ తాజా నివేదికలతో మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటన ప్రకారం భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ వంటి దేశాల నౌకలకు హర్మూజ్ జలసంధిలో ప్రయాణానికి అనుమతి ఉంది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన నౌకల రవాణాకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఈ టోల్ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఈ నిర్ణయం ప్రపంచ చమురు రవాణాపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

















