ఇంటర్, డిగ్రీ తర్వాత సైకాలజీ చదవాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కోర్సును ఎలా చదవాలి అన్న విషయంలో స్పష్టత చాలా అవసరం. ముఖ్యంగా దూరవిద్య/ ఆన్‌లైన్ ద్వారా సైకాలజీ డిగ్రీలు పొందవచ్చా? అనే సందేహం చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలను పరిశీలిస్తే సైకాలజీ లాంటి సబ్జెక్టులను దూరవిద్యలో అభ్యసించడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది.
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో 2025లో జారీచేసిన నిబంధనల ప్రకారం హెల్త్‌కేర్ రంగానికి అనుబంధమైన ముఖ్యమైన కోర్సులను దూరవిద్య, ఆన్‌లైన్ లేదా ఓపెన్ యూనివర్సిటీ విధానంలో అందించడానికి అనుమతి లేదు. నేషనల్ కమిషన్ ఫర్ అల్లైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్, 2021 ప్రకారం సైకాలజీ కూడా హెల్త్‌కేర్ అనుబంధ సబ్జెక్టుల జాబితాలో ఉంది. అందువల్ల యూజీ, పీజీ స్థాయిలో సైకాలజీ కోర్సులను కేవలం రెగ్యులర్ పద్ధతిలోనే అభ్యసించాలి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా విద్యా సంస్థ కోర్సులను అందించినా ఆ డిగ్రీలకు చెల్లుబాటు ఉండదు. అయితే ఇప్పటికే ఈ కోర్సును దూరవిద్యలో పూర్తిచేసినవారి డిగ్రీలు మాత్రం చెల్లుబాటు అవుతాయి.
- సైకాలజీ సిద్ధాంతాలపై ఆధారపడిన సబ్జెక్టు మాత్రమే కాదు. ఇందులో ప్రాక్టికల్ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. ల్యాబ్ ఎక్స్‌పర్‌మెంట్స్, కేస్ స్టడీస్, సైకలాజికల్ టెస్టింగ్, కౌన్సెలింగ్ సెషన్లు లాంటి అంశాలు ప్రత్యక్షంగా నేర్చుకోవాలి. ముఖ్యంగా క్లినికల్, కౌన్సెలింగ్ సైకాలజీ లాంటి రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం లేకుండా నైపుణ్యం సాధించడం కష్టమే.
- అధ్యాపకుల మార్గదర్శకత్వం కూడా ఈ కోర్సులో చాలా ముఖ్యం. కేస్ హ్యాండ్లింగ్, ఎథికల్ ఇష్యూలు లాంటి విషయాల్లో అధ్యాపకులతో నేరుగా చర్చలు జరపడం ద్వారా లోతైన అవగాహన పెరుగుతుంది. రెగ్యులర్ కోర్సుల్లో బృంద చర్చలు, రోల్ ప్లే, ఫీల్డ్ వర్క్ లాంటి అంశాలు విద్యార్థుల కమ్యూనికేషన్, కౌన్సెలింగ్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి.
- ఉద్యోగ అవకాశాల పరంగా రెగ్యులర్ సైకాలజీ డిగ్రీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. హాస్పిటల్స్, స్కూళ్లు, కార్పొరేట్ సంస్థలు, పరిశోధనా సంస్థల్లో పనిచేయాలంటే ప్రాక్టికల్ అనుభవంతో కూడిన అర్హతలు అవసరం. అందుకే ఈ కోర్సును ఎంపిక చేసుకునే విద్యార్థులు రెగ్యులర్ పద్ధతిలో చదవడం ఉపయోగకరం.
సైకాలజీ సబ్జెక్టులో ఆసక్తి ఉంటే పుస్తకాలు చదవడం ద్వారా ప్రాథమిక అవగాహన పొందవచ్చు. కానీ ప్రొఫెషనల్ సైకాలజిస్టుగా ఎదగాలంటే రెగ్యులర్ విద్యావిధానంలో చదవడం తప్పనిసరి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















