హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రద్దీగా ఉండే రహదారిపై ఆరున్నరేళ్ల చిన్నారికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్సై వ్యవహారంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైగా పనిచేస్తున్న పూజారి తిరుపతి తన మనవరాలికి గంధంగూడ రోడ్డులో కారు నడపడం నేర్పిస్తున్నారు. చిన్నారి డ్రైవింగ్ చేస్తుండటాన్ని గమనించిన కొందరు వాహనదారులు, స్థానికులు వెంటనే అడ్డుకుని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎస్సై కారు ఆటోమేటిక్ వాహనం అని, బ్రేక్-కంట్రోల్ తన చేతిలోనే ఉంటుందని వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే చిన్నారి తన తాత ఎస్సై అని చెప్పడంతో అక్కడ ఉన్నవారి దృష్టి మరింత ఆకర్షించింది. ఈ క్రమంలో కొద్దిసేపు రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఘటనను కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని, ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్‌కు వాహనం అప్పగించడం, రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. విషయం డీజీపీ సీవీ ఆనంద్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఎస్సై పూజారి తిరుపతిని సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణ చేపట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.
రోడ్డు భద్రత విషయంలో పోలీసు సిబ్బంది కూడా ఆదర్శంగా ఉండాలని, నిబంధనలను ఎవరూ ఉల్లంఘించకూడదని అధికారులు స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















