ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా షూటర్లు అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో ఆకృతి దహియా 354.2 పాయింట్లతో రజత పతకం గెలుచుకుంది. అంజుమ్ మౌద్గిల్ 340.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
ఈ విభాగంలో కజకిస్తాన్‌కు చెందిన సోఫియా షుజెంకో 358.2 పాయింట్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకం సాధించింది. ఆమె ఆసియా, ప్రపంచ జూనియర్, ఆసియా జూనియర్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది.
ఇక జూనియర్ మహిళల 3 పొజిషన్ విభాగంలో ప్రాచి గైక్వాడ్ 353.3 పాయింట్లతో స్వర్ణ పతకం గెలిచింది. కజకిస్తాన్‌కు చెందిన తొమిరిస్ అమనోవా 351.4 పాయింట్లతో రజతం సాధించగా, భారత క్రీడాకారిణి అనుష్క తోకుర్ 341.1 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకుంది.ప్రాచి, అనుష్క, హేజెల్‌లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఈ విజయాలతో భారత షూటింగ్ జట్టు ఆసియా స్థాయిలో మరోసారి తమ ప్రతిభను చాటుకుంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















