టీ20 ప్రపంచకప్‌లో భారత్–పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. భారత్‌తో మ్యాచ్ ఆడబోమని తొలుత సంకేతాలు ఇచ్చిన పాకిస్థాన్, ఐసీసీ జోక్యంతో వెనక్కి తగ్గింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
భారత్–పాక్ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణ. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగే ఈ పోటీలు ఎప్పుడూ హై వోల్టేజ్‌గా ఉంటాయి. ఈసారి కూడా పాక్ బహిష్కరణ డ్రామా తర్వాత మ్యాచ్ జరగడం ఆసక్తిని రెట్టింపు చేసింది.
టీ20 ప్రపంచకప్ చరిత్రను పరిశీలిస్తే భారత్ స్పష్టమైన ఆధిపత్యం చాటుకుంది. 2007 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్ ఏకంగా ఏడు విజయాలు సాధించగా, పాకిస్థాన్ ఒక్కసారే (2021లో) గెలిచింది. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య జరిగిన 16 టీ20ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించగా, పాక్ మూడుసార్లు మాత్రమే గెలిచింది.2007 టీ20 వరల్డ్‌కప్‌లో రెండు సార్లు తలపడిన ఇరుజట్లలో రెండింటిలోనూ భారత్ విజయం సాధించింది. అదే ఎడిషన్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2024 వరల్డ్‌కప్‌లో కూడా పాక్‌పై భారత్ అద్భుత పోరాటం చేసి 119 పరుగులకే ఆలౌటైనా లక్ష్యాన్ని కాపాడుకుంటూ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24) కీలక పాత్ర పోషించారు.
2012 టీ20 ప్రపంచకప్‌లో కూడా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. ఇప్పుడు అదే వేదికపై మ్యాచ్ జరగనుండడంతో మరోసారి విజయాన్ని పునరావృతం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లలో పాకిస్థాన్‌పై టీ20ల్లో తిలక్ వర్మ మూడు ఇన్నింగ్స్‌ల్లో 130 పరుగులతో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. ఓవరాల్‌గా చూస్తే విరాట్ కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 492 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మొత్తంగా రికార్డులు భారత్‌కే అనుకూలంగా ఉండటంతో ఫిబ్రవరి 15న జరగబోయే ఈ దాయాదుల సమరంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















