భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరుగుతున్న వేళ.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముగ్గురు యువ ఇంజినీర్లు కీలక పాత్ర పోషించడం విశేషంగా నిలిచింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 ఆర్బిటల్ ప్రయోగ వాహక విజయవంతమైన ప్రయోగంలో సిరిసిల్లకు చెందిన అడుప సంతోష్‌కుమార్, అడుప కిరణ్, బొమ్మదేని నాగరాజు తమ సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకున్నారు.
విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి ముందు నిర్వహించిన కీలక తనిఖీలు, సాంకేతిక పరీక్షల్లో అడుప సంతోష్‌కుమార్ అవియానిక్స్ చెక్‌అవుట్ లీడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాకెట్ రూపకల్పనకు సంబంధించిన డిజైన్ పనుల్లో అడుప కిరణ్ క్యాడ్ డిజైనర్‌గా కీలకంగా వ్యవహరించారు. మరోవైపు బొమ్మదేని నాగరాజు ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ విభాగంలో రాకెట్ విద్యుత్ వ్యవస్థల సమీకరణలో భాగస్వామ్యమయ్యారు.
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విక్రమ్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం భారత ప్రైవేటు అంతరిక్ష రంగానికి కీలక ముందడుగుగా నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజినీర్లు భాగస్వాములు కావడం సిరిసిల్ల జిల్లాకు ప్రత్యేక గర్వకారణంగా మారింది. వారి సాంకేతిక ప్రతిభ, పట్టుదల, కృషి జిల్లాలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















