క్రికెట్ చరిత్రలో భారత్–పాక్ మ్యాచ్‌లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ 2003 ప్రపంచకప్‌లో జరిగిన ఆ ‘శివరాత్రి’ సమరానికి మరింత ప్రత్యేకత ఉంది. ICC Cricket World Cup 2003లో భారత్–పాక్ పోరు కేవలం మ్యాచ్ మాత్రమే కాదు.. భావోద్వేగాల తుఫాను. ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల మదిలో మెరిసిపోతూనే ఉంది.
నాడు ఉద్రిక్తతల మధ్యే మ్యాచ్
2001 పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత భారత్–పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తలపడటం సహజంగానే ఉత్కంఠ రేకెత్తించింది. టోర్నీ ఆరంభంలో టీమ్ ఇండియా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.ఇక పాక్ పేసర్ షోయబ్ అక్తర్ “భారత్ టాప్‌ఆర్డర్‌ను కూలదోయగలను” అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత వేడి పెంచాయి. ఆ సవాల్‌కు సమాధానం చెప్పేందుకు సచిన్ సిద్ధమయ్యాడు.
క్రీజ్‌లో శివతాండవం
పాక్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యం పెద్దదే. కానీ సచిన్ మొదటి నుంచే దూకుడు చూపించాడు. అక్తర్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ మీదుగా కొట్టిన ఆ సిక్స్ ఇప్పటికీ అభిమానులకు రోమాంచనం కలిగిస్తుంది. కేవలం 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి మ్యాచ్ దిశను మార్చేశాడు.సచిన్–కైఫ్ భాగస్వామ్యం మ్యాచ్‌కు వెన్నెముకగా నిలిచింది. మధ్యలో క్రాంప్స్‌తో ఇబ్బంది పడ్డా.. సచిన్ పోరాటం ఆపలేదు. చివరికి భారత్ ఆ మ్యాచ్‌ను గెలిచి ప్రపంచకప్‌లో పాక్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించింది.
డ్రెస్సింగ్‌రూమ్‌లో టెన్షన్.. బయట సంబరాలు
మ్యాచ్ ముందు డ్రెస్సింగ్‌రూమ్‌లో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. అయితే సచిన్ మాత్రం ప్రశాంతంగా ఐస్‌క్రీమ్ తింటూ మైదానానికి సిద్ధమయ్యాడు. మ్యాచ్ తర్వాత సంబరాల మధ్య తన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ మెడల్‌ను మరిచిపోయిన ఘటన కూడా ఆసక్తికరమే.
ఇప్పుడు 2026 ‘శివరాత్రి’ సన్నివేశం
ప్రస్తుతం కూడా భారత్–పాక్ మ్యాచ్ అంటే అదే ఉద్రిక్తత. ఇషాన్, అభిషేక్, సూర్య, తిలక్, పాండ్య, దూబే, సంజూ వంటి యువ ఆటగాళ్లతో టీమ్ ఇండియా దూకుడుగా ఉంది. 2024 నుంచి టీ20ల్లో 200+ స్కోర్లు వరుసగా నమోదు చేయడం జట్టు బలాన్ని చూపుతోంది.అయితే స్పిన్ సవాళ్లు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. కొలంబో వంటి మైదానాల్లో స్పిన్‌ను ఎలా ఎదుర్కొంటారన్నది కీలకం. మరోవైపు పాక్ జట్టులో యువ మిస్టరీ స్పిన్నర్లు కొత్త ముప్పుగా మారుతున్నారు.అభిమానుల ఆశ ఒక్కటే — 2003 శివరాత్రి నాటి సన్నివేశాలు మళ్లీ పునరావృతం కావాలి. మరోసారి భారత్ జెండా ఎగరాలి.
టీమ్ ఇండియాకు ఆల్ ది బెస్ట్..!
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















