అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్న సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం కనిపించింది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడాయి.
ఉదయం 9.41 గంటల సమయానికి సెన్సెక్స్ 519 పాయింట్లు లాభపడి 78,613 వద్ద, నిఫ్టీ 172 పాయింట్లు పెరిగి 24,557 వద్ద ట్రేడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.13గా నమోదైంది. నిఫ్టీలో ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫైనాన్స్, టీఎంపీవీ షేర్లు లాభాల్లో ఉండగా.. సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, సిప్లా, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.
ఇరాన్‌తో సోమవారం మధ్యాహ్నం నుంచి చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ముడిచమురు ధరలు దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 5 శాతం తగ్గి బ్యారెల్‌కు 83.5 డాలర్లకు చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలతో చమురు ధరలు మరింత స్థిరపడితే మార్కెట్లకు ఊతం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















