దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలపై పెరుగుతున్న ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో నేటి ట్రేడింగ్ సెషన్‌లో సూచీలు ఒత్తిడికి లోనై క్షీణత నమోదు చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పడిపోవడం గమనార్హం.
ఉదయం 9.29 గంటల సమయానికి సెన్సెక్స్ 825 పాయింట్లు తగ్గి 74,387 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 265 పాయింట్లు పతనమై 23,378 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ కూడా చారిత్రక స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 96.20 వద్ద రికార్డు స్థాయిలో బలహీనపడింది. ముడి చమురు ధరల పెరుగుదల, వాణిజ్య లోటు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, ద్రవ్యోల్బణ భయాలు కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి.
హర్మూజ్ జలసంధి అంశంపై ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారని వచ్చిన వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో కలకలం రేగింది. ఈ పరిణామాల మధ్య బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 111 డాలర్లకు చేరినట్లు ఫ్యూచర్స్ మార్కెట్ సంకేతాలు సూచిస్తున్నాయి.
అంతేకాకుండా రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఇచ్చిన ఆంక్షల మినహాయింపు గడువు ముగియడం కూడా భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత పెంపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో అమెరికా, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణ భయాలు మరింత పెరుగుతున్నాయి, ఇది భారత మార్కెట్లపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















