అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలపై కొనసాగుతున్న ఆందోళనలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. శాంతి చర్చలు సానుకూల ఫలితాలు ఇవ్వకపోతే ఈ వారం కూడా మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట కొనసాగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, కార్పొరేట్ సంస్థల మార్చి త్రైమాసిక ఫలితాలు బలంగా నమోదవడం మార్కెట్‌కు కొంత ఊరటనివ్వొచ్చని భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణ ప్రభావం మరో 2-3 త్రైమాసికాల పాటు కొనసాగవచ్చని, అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా మార్కెట్లు పూర్తిగా స్థిరపడటానికి 6-8 నెలల సమయం పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికంగా నిఫ్టీ-50 సూచీకి 23,580 పాయింట్ల వద్ద మద్దతు, 23,800 వద్ద నిరోధం కనిపిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు.
ఇంధన ధరలు మరోసారి పెరిగే అవకాశాలపై ఉన్న అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయవచ్చని భావిస్తున్నారు. విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ.27,000 కోట్లు ఉపసంహరించగా, 2026 ప్రారంభం నుంచి చూస్తే ఈ మొత్తం రూ.2.2 లక్షల కోట్లకు చేరింది. రూపాయి మార్పిడి విలువ, విదేశీ పెట్టుబడిదారుల ధోరణి కూడా మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి.
రంగాల వారీగా చూస్తే, వొడాఫోన్ ఐడియా లాభాల్లోకి రావడంతో టెలికాం షేర్లపై సానుకూల ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫార్మా రంగం కూడా బలంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా మధ్య, చిన్న స్థాయి ఔషధ కంపెనీల షేర్లలో ర్యాలీ కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఆటో, యంత్రపరికరాలు, సిమెంట్ రంగాలపై ఒత్తిడి కొనసాగొచ్చని చెబుతున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా వ్యయాలు, ముడి పదార్థాల ఖర్చులు పెరగడం ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నారు. హర్మూజ్ జలసంధి పరిస్థితులు మరింత దిగజారితే పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం మరింత పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు.
లోహ రంగం మాత్రం సమీప భవిష్యత్తులో మంచి ప్రదర్శన ఇవ్వొచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. లోహ ధరలు స్థిరంగా పెరుగుతుండడం వల్ల కంపెనీల ఆదాయాలు మెరుగుపడే అవకాశం ఉందని, ధరలు పడినప్పుడు కొనుగోళ్లు చేయవచ్చని బ్రోకరేజీలు సూచిస్తున్నాయి.
ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాలు పరిమిత శ్రేణిలోనే ట్రేడయ్యే అవకాశం ఉందని అంచనా. గత వారం విక్రయాల ఒత్తిడి తర్వాత ఐటీ రంగంలో స్వల్ప రికవరీ కనిపించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















