అమరావతి – రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలిపారు. కాకినాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.
ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయించడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ విధమైన చర్యల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగడమే కాకుండా, ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, ఎమ్మార్పీకి మించి ధరలు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్ ఆదేశించారు. మద్యం విక్రయాల్లో పారదర్శకత ఉండాలని, నిబంధనల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















