మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం తుది విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, నాగముత్తు వాదనలు వినిపించారు. ఇప్పటివరకు సుమారు రూ.2,500 కోట్లను తిరిగి చెల్లించినట్లు వారు ధర్మాసనానికి వివరించారు. ఇంకా క్లెయిమ్ చేయని రూ.5.23 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే తెలంగాణ హైకోర్టు తదుపరి ప్రక్రియను నిర్వహించిందని మార్గదర్శి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ నోటీసు జారీ చేసి, తదనుగుణంగా ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు.
విచారణ సందర్భంగా పిటిషన్ దాఖలు చేయడంపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. మార్గదర్శి వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసి పోరాడేందుకు మీకు ఉన్న హక్కు ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కేసులోని అంశాలను పరిశీలిస్తే ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశంగా కాకుండా వ్యక్తిగత వివాదంలా కనిపిస్తోందని జస్టిస్ ఎంఎం సుందరేశ్ వ్యాఖ్యానించారు. కేసులో మీరు వాదనలు కొనసాగించే కొద్దీ మీపైనే అనుమానాలు పెరుగుతున్నాయని ధర్మాసనం పేర్కొంది.
ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌కు సుప్రీంకోర్టులో ముగింపు లభించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















