టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో Scotland జట్టు ఆధిపత్య ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన Italy 16.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. దీంతో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది.
ఇటలీ బ్యాటింగ్‌లో బెన్ మానెంటి (52; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), హెన్రీ మానెంటి (37; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), స్మట్స్ (22; 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఒక దశలో 12 ఓవర్లకు 113/3తో నిలిచిన ఇటలీ, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. కేవలం 21 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.స్కాట్లాండ్ బౌలర్లలో మైకేల్ లీస్క్ 4 వికెట్లతో చెలరేగగా, మార్క్ వాట్ 2 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ క్యూరీ, బ్రాడ్ వీల్, ఆలివర్ డేవిడ్సన్ ఒక్కో వికెట్ సాధించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సే (84; 54 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ మైకేల్ జోన్స్ (37; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా కీలకంగా రాణించాడు. ఈ జోడీ తొలి వికెట్‌కు 126 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.
తర్వాత వచ్చిన బ్రాండన్ మెక్‌ముల్లెన్ (41*; 18 బంతుల్లో 4 సిక్స్‌లు) వేగంగా పరుగులు రాబట్టాడు. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 15 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మైకేల్ లీస్క్ (22*; 5 బంతుల్లో) వరుసగా 4, 2, 4, 6, 6 బాదడంతో స్కాట్లాండ్ స్కోరు 200 పరుగుల మార్కును దాటింది.ఇటలీ బౌలర్లలో అలీ హసన్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా, స్మట్స్ తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో స్కాట్లాండ్ జట్టు గ్రూప్ దశలో తమ స్థితిని మరింత బలపర్చుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















