రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన అనే మూడు అంశాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. క్లస్టర్ బేస్డ్ విధానంలో పరిశ్రమలను ఒకే ప్రాంతంలో సమీకరించడం ద్వారా ముడి పదార్థాల సరఫరా నుంచి తయారీ, టెస్టింగ్, సర్టిఫికేషన్, మార్కెటింగ్ వరకు పూర్తి ఎకోసిస్టమ్‌ను నిర్మించడం లక్ష్యమని చెప్పారు.
ప్రతి క్లస్టర్‌లో వర్టికల్ మరియు హారిజంటల్ ఇంటిగ్రేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. వర్టికల్ అంటేే ప్రధాన పరిశ్రమలతో పాటు అనుబంధ యూనిట్లను కూడా అదే ప్రాంతంలో ఏర్పాటు చేయడం. హారిజంటల్ అంటే విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ సెంటర్లు, సర్టిఫికేషన్ ల్యాబ్‌లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం. దీని ద్వారా యువతకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్థానికంగా పరిశ్రమల పెరుగుదలకు దోహదం అవుతుందని తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌ను పూర్తిగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మార్చుతున్నామని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల ప్రతినిధులతో చర్చించి వారికి అవసరమైన మ్యాన్‌పవర్ మ్యాపింగ్ చేపట్టామని, ఆయా రంగాలకు అనుగుణంగా కోర్సులను అప్‌గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆధునిక సాంకేతికతలకు సంబంధించిన కోర్సులు ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
గ్రీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఏఐ, మిషన్ లెర్నింగ్, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైసెస్ వంటి రంగాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో పరిశోధన, ప్రోటోటైపింగ్, డిజైన్ సెంటర్లను రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జాబ్ మేళాల ద్వారా ఇప్పటికే లక్ష మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రమం తప్పకుండా జాబ్ ఫెయిర్లు నిర్వహించి స్థానిక యువతకు సమీపంలోనే ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యమని చెప్పారు.
త్వరలో ప్రారంభించనున్న నైపుణ్యం పోర్టల్ ద్వారా విద్యార్థులు తమ స్కిల్ ప్రొఫైల్‌ను నమోదు చేసుకుని, ఏఐ ఆధారిత అసెస్‌మెంట్ ద్వారా సరైన కోర్సులను ఎంచుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగ అవకాశాలను కూడా అదే వేదికపై అందుబాటులో ఉంచి, ఇంటర్వ్యూ శిక్షణ, రెస్యూమ్ అప్‌గ్రేడ్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
న్యాక్ బలోపేతంతో నిర్మాణ రంగంలో ప్రపంచస్థాయి నైపుణ్యం కలిగిన కార్మికులను తయారు చేయడమే లక్ష్యమని, రాబోయే 90 రోజుల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















