రాణిపేట (తమిళనాడు) | సోమవారం — ప్రముఖ కార్ల తయారీ సంస్థ Tata Motors కు చెందిన Tata Motors Passenger Vehicles (TMPV) Limited తమిళనాడులో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. రాణిపేట జిల్లా పాణపక్కంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను సోమవారం అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి M. K. Stalin, టాటా గ్రూప్ ఛైర్మన్ Natarajan Chandrasekaran పాల్గొన్నారు. ప్లాంట్ ప్రారంభం సందర్భంగా స్థానికంగా తయారైన Range Rover Evoque మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు.
టాటా మోటార్స్ ప్రకటన ప్రకారం, రాబోయే 5–7 ఏళ్లలో ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఈ ప్లాంట్‌పై సుమారు ₹9,000 కోట్లు పెట్టుబడి వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ తయారీ కేంద్రంలో Tata Motors Passenger Vehiclesతో పాటు, అనుబంధ సంస్థ Jaguar Land Rover (JLR) కు చెందిన కార్లను కూడా తయారు చేయనున్నారు. దశలవారీగా ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించి, దేశీయంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు ఇక్కడి నుంచే వాహనాలను సరఫరా చేయనున్నారు.ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని టాటా మోటార్స్ తెలిపింది. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















