శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు టీమ్‌ఇండియా తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. శ్రీలంకలోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ముగ్గురూ ఎడమచేతి వాటం బౌలర్లే కావడం విశేషం.
భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చాయి. కుల్‌దీప్ యాదవ్‌ను ఎటాకింగ్ బౌలర్‌గా పేర్కొన్న ఆయన.. అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మానవ్ సుతార్ బంతిని ఎక్కువగా టర్న్ చేయగలడని, రవీంద్ర జడేజా నిలకడగా లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయగలడని వివరించారు.
ఈ ముగ్గురు స్పిన్నర్లు జట్టులో ఉంటే 20 వికెట్లు తీసే సామర్థ్యం, నైపుణ్యం తమకు ఉందని మోర్కెల్ అభిప్రాయపడ్డారు. అయితే పిచ్ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ ముగ్గురినీ ఏ విధంగా ఉపయోగించుకుంటాడనేది కీలకంగా మారనుంది.
పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్‌కు తోడుగా ఎవరిని ఎంపిక చేస్తారనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ ఇటీవల నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నారని మోర్కెల్ తెలిపారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ బంతి సాఫ్ట్‌గా మారే అవకాశం ఉన్నందున షార్ట్ బాల్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే వ్యూహంపైనా దృష్టి సారించనున్నట్లు చెప్పారు.
మరోవైపు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తొలి టెస్టు కోసం భారత తుది జట్టును అంచనా వేశారు. ఆయన కూడా ముగ్గురు ఎడమచేతి స్పిన్నర్లకే తన అంచనా జట్టులో చోటు కల్పించారు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం అశ్విన్ అంచనా వేసిన తుది జట్టులో స్థానం దక్కలేదు.
అశ్విన్ అంచనా ప్రకారం యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తుది జట్టులో ఉండే అవకాశముంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















