తైవాన్‌లో జరుగుతున్న కంప్యూటెక్ 2026లో టెక్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా అనేక ఏఐ ఆధారిత ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. ఈ మెగా టెక్ సదస్సులో ఇంటెల్ తన తదుపరి తరం ప్రాసెసర్లతో పాటు కొత్త ఏఐ సాంకేతికతలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది. ముఖ్యంగా ఏఐ మౌలిక సదుపాయాలు, ఎంటర్‌ప్రైజ్ కంప్యూటింగ్ రంగాల్లో కొత్త పరిష్కారాలను పరిచయం చేసింది.
ఇంటెల్ తీసుకొచ్చిన రాక్‌స్కేల్ ఏఐ ఇన్‌ఫ్రా ప్లాట్‌ఫాం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధిక పనితీరు కలిగిన ఏఐ ఇన్ఫరెన్స్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ ఆవిష్కరణలు ఏఐ వర్క్‌లోడ్స్‌ను వేగవంతం చేయడమే కాకుండా ఖర్చును కూడా తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇంటెల్ సీఈఓ లిప్ బూ టాన్ మాట్లాడుతూ, తమ భాగస్వాములతో కలిసి అద్భుతమైన ఉత్పత్తులను తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఏఐ శక్తితో ప్రజలకు మరింత మెరుగైన భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ సదస్సులో పర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్, ఫాక్స్‌కాన్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ జెర్సీ హసియో, సాంబనోవా సీఈఓ రోడ్రిగో లియాంగ్, విస్టా ఈక్విటీ పార్టనర్స్ సీఈఓ రాబర్ట్ స్మిత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
సాంబనోవా సీఈఓ రోడ్రిగో లియాంగ్ ఏఐ వర్క్‌లోడ్స్‌ను ఇంటెల్, ఎన్‌విడియా, సాంబనోవా చిప్‌లలో ఎలా సమర్థవంతంగా పంపిణీ చేయవచ్చో ప్రత్యక్షంగా చూపించారు. దీని ద్వారా ఒకే ఏఐ మోడల్‌ను వేర్వేరు కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్లపై నడపడం సాధ్యమని ఆయన వివరించారు.
అలాగే ఫాక్స్‌కాన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ సామర్థ్యాలను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. సీపీయూ డెన్స్ వేరియంట్ల తయారీ ద్వారా ఏఐ మరియు డేటా ప్రాసెసింగ్ వర్క్‌లోడ్స్‌ను తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపింది.
ఇంకా, ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన పెర్‌ప్లెక్సిటీ కంప్యూటర్‌లో సుమారు 20 వరకు వేర్వేరు ఏఐ మోడళ్లను వినియోగించుకోవచ్చని అరవింద్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆవిష్కరణలు ఏఐ రంగంలో కొత్త దిశను సూచిస్తున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















