తిరువణ్ణామలై – తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అన్నామలై గిరి ఎక్కిన ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 2,668 అడుగుల ఎత్తైన ఈ కొండను ఎక్కడం అటవీశాఖ నిషేధించింది.
ఈ నేపథ్యంలో బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్ అనుమతి లేకుండా అన్నామలై కొండ ఎక్కి అక్కడ ఫొటోలు తీసి, వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అటవీశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో నటి అర్చనా రవిచంద్రన్‌తో పాటు నటుడు అరుణ్ ప్రసాద్ కూడా కొండపైకి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరికీ రూ.5 వేల చొప్పున జరిమానా విధించి, భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించి పంపినట్లు అధికారులు తెలిపారు.
పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసే ఈ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















