ప్రతిష్టాత్మక Forbes ‘30 అండర్ 30 ఆసియా-2026’ జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. ఆర్థిక అక్షరాస్యతను చిన్నారులకు సులభంగా నేర్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న Geni5 వ్యవస్థాపకుడు శివ గణేష్ గడ్డం, గ్రామీణ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న Edodhwaja Foundation వ్యవస్థాపకుడు మధులాష్ బాబు క్రొవ్విడి ఈ జాబితాలో స్థానం సంపాదించారు.
శివ గణేష్ గడ్డం చిన్నారులకు ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు కామిక్స్ రూపంలో పొదుపు, పెట్టుబడులు, బీమా, బడ్జెట్ వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. డిజిటల్ యుగంలో డబ్బు నిర్వహణపై యువతకు అవగాహన కల్పించేందుకు ఆయన ప్రారంభించిన జెని5కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రస్తుతం విద్యార్థులకు నేరుగా ఆర్థిక సేవలు అందించేందుకు ఆర్‌బీఐ అనుమతుల కోసం సంస్థ ప్రయత్నిస్తోంది.
ఇక పశ్చిమగోదావరి జిల్లా శృంగవృక్షం గ్రామానికి చెందిన మధులాష్ బాబు క్రొవ్విడి గ్రామీణ విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో ‘ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్’ అనే వినూత్న ప్రాజెక్టును ప్రారంభించారు. ‘ఫ్లో బస్’ పేరుతో రూపొందించిన ఈ మొబైల్ ల్యాబ్ ద్వారా ఇప్పటివరకు 60 వేల మందికి పైగా విద్యార్థులకు సాంకేతిక విద్య అందించారు.తెలుగు యువత ఆవిష్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం రాష్ట్రానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















