Donald Trump చిత్రంతో ప్రత్యేక 250 డాలర్ల కరెన్సీ నోట్‌ను తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక నోటును విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
అమెరికా ట్రెజరర్ బ్రాండన్ బీచ్ ఆర్థిక శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎంగ్రేవింగ్ అండ్ ప్రింటింగ్ అధికారులకు 250 డాలర్ల నోట్ల ప్రోటోటైప్స్ సిద్ధం చేయాలని సూచించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదన అమల్లోకి రావాలంటే కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి.
1866 తర్వాత జీవించి ఉన్న వ్యక్తి చిత్రంతో అమెరికా కరెన్సీ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ చిత్రంతో డాలర్ నోట్ విడుదల అయితే అది అమెరికా చరిత్రలో కీలక పరిణామంగా నిలవనుంది.
ఇటీవల ట్రంప్ చిత్రంతో ప్రత్యేక బంగారు నాణెం విడుదల చేసే యోచనను కూడా అమెరికా ప్రకటించింది. ఇప్పుడు కరెన్సీ నోటుపై కూడా ట్రంప్ ఫోటో చర్చకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ఇక అమెరికా ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే.. గత వారం నిరుద్యోగ దరఖాస్తులు 2.15 లక్షలకు చేరుకున్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే ఇవి స్వల్పంగా పెరిగాయి. మరోవైపు ద్రవ్యోల్బణం గత నెలలో 3.8 శాతానికి చేరి మూడేళ్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















