తెలుగు రంగస్థల, సినీ రంగాలకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు వైఎస్ కృష్ణేశ్వరరావు (71) కన్నుమూశారు. గుంటూరు ఏటీ అగ్రహారంలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతి చెందడంతో కళారంగంలో విషాదం నెలకొంది.
యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావుగా జన్మించిన ఆయన.. వైఎస్ కృష్ణేశ్వరరావుగా తెలుగు నాటక, చలనచిత్ర రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 1,500కు పైగా నాటకాల్లో నటించి రంగస్థలంపై తనదైన ముద్ర వేశారు. ‘వాపస్’ ఆయన తొలి నాటకం.
‘రోజూ చస్తున్న మనిషి’, ‘సంపద’, ‘పక్కింట్లో పుట్టండి’, ‘గుర్తుతెలియని శవం’ వంటి ప్రయోగాత్మక నాటకాలను రచించి, దర్శకత్వం వహించి, ప్రదర్శించారు. పొన్నూరు కళాపరిషత్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా పనిచేసిన ఆయన.. రసఝరి నాటక పరిషత్‌ను స్థాపించి రంగస్థల కళల అభివృద్ధికి సేవలందించారు.
సినీ రంగంలోనూ కృష్ణేశ్వరరావు తన ప్రతిభను చాటుకున్నారు. ‘శ్రీరాములయ్య’, ‘భద్రాచలం’ చిత్రాలకు కథ అందించారు. ‘పరశురామ్’ సినిమాకు మాటలు రాశారు. ‘జయం మనదేరా’ రచనా బృందంలో పనిచేశారు. ‘నేను సైతం’ చిత్రానికి గీత రచయితగా వ్యవహరించారు.
నటుడిగా ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను’, ‘చందమామ కథలు’, ‘గోపీ గోపిక గోదావరి’, ‘నాంది’, ‘విరూపాక్ష’ తదితర చిత్రాల్లో నటించారు. ‘చందమామ కథలు’ సినిమాలో బిచ్చగాడి పాత్రకు నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం అందుకున్నారు.
కృష్ణేశ్వరరావు మృతిపట్ల పలువురు రంగస్థల, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు నాటక రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















