సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారికి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది.
విజయవాడకు చెందిన రహంతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహ్మద్ డానిష్‌లు పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.టాస్క్ ఫోర్స్‌తో కలిసి సంయుక్త దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
మంగళవారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నిందితులు తమకు న్యాయవాది లేరని తెలిపారు. న్యాయసహాయం కల్పించాలని కోర్టును కోరారు.విచారణ అనంతరం న్యాయమూర్తి వారికి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించారు. తరువాత వారిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















