అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ టెస్లా, హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఉన్న నాలెడ్జ్ సిటీలో తన కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించింది. ఇది భారత్‌లో టెస్లాకు ఐదో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా నిలిచింది. ఈ కేంద్రం ద్వారా వినియోగదారులు సంస్థకు చెందిన తాజా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యక్షంగా చూడటంతో పాటు వాటి టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు, డ్రైవింగ్ పనితీరు వంటి అంశాలపై సమగ్ర అవగాహన పొందవచ్చు.
ఈ సందర్భంగా టెస్లా సరికొత్త 2026 మోడల్ వై ప్రీమియం, మోడల్ వై ఎల్ వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్లు ఆధునిక డిజైన్‌తో పాటు అధునాతన టెక్నాలజీ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు బొల్లారం పారిశ్రామికవాడలో డెలివరీ మరియు సర్వీసింగ్ కేంద్రాన్ని కూడా టెస్లా ఏర్పాటు చేసింది. అలాగే హైదరాబాద్ నగరం మొత్తం వ్యాప్తంగా సూపర్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ధరల విషయానికి వస్తే, మోడల్ వై ప్రీమియం కారు ఎక్స్‌షోరూం ధర రూ.50,89,000గా ఉంది. వినియోగదారులు రూ.6,00,000 డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.39,990 ప్రారంభ ఈఎంఐతో (స్టెపప్ విధానంలో ఏడేళ్ల కాలపరిమితి) ఈ కారు అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం ఈ కారుకు ఉంది.
ఇక మోడల్ వై ఎల్ అనేది ఆల్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీగా రూపొందించబడింది. ఇందులో మూడు వరుసల్లో ఆరుగురు ప్రయాణించగలిగే సౌకర్యం ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో ఇది 681 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని ప్రారంభ ధర రూ.61,99,000గా నిర్ణయించారు. రూ.6,50,000 డౌన్‌పేమెంట్‌తో నెలకు రూ.49,990 ప్రారంభ ఈఎంఐతో (స్టెపప్ విధానంలో ఏడేళ్ల కాలపరిమితి) ఈ వాహనం అందుబాటులో ఉంటుంది.
టెస్లా ప్రకటన ప్రకారం, ఈ కొత్త మోడళ్ల డెలివరీలు జులై నుంచి ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో హోమ్ ఛార్జింగ్ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















