అద్భుతమైన ఆటతీరు కనబరిస్తే ఎంపిక చేయడానికి వయసు అడ్డంకి కాబోదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతోన్న స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలని సూచించాడు. ప్రస్తుతం భువీ వద్దే పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసే బౌలర్) ఉంది. బ్యాటర్లు దూకుడుగా ఆడే టీ20ల్లో ఇప్పటికీ భువీ సత్తా చాటుతున్నాడు. స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి అవకాశం కల్పించాలని సెహ్వాగ్ బీసీసీఐకి కీలక సూచనలు ఇచ్చాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు భువీ జతైతే ప్రత్యర్థులకు మరిన్ని కష్టాలు తప్పవని తెలిపాడు.
‘‘వయసు అనేది అదొక నంబర్ మాత్రమేనని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. భువనేశ్వర్‌కు ఇప్పుడు 35 లేదా 36 ఏళ్లు ఉండొచ్చు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అలాంటప్పుడు టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు పునరాగమనంపై ఆలోచన చేయడంలో తప్పులేదు. సెలక్టర్లూ దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కాంబినేషన్‌ను ఇప్పటికే చూశాం. మరోసారి అలా ప్రయత్నించొచ్చు. భువీ బౌలింగ్‌లో ఇప్పటికీ ఆ షార్ప్‌నెస్ తగ్గలేదు. మునుపటి భువనేశ్వర్‌ను చూస్తున్నట్లే ఉంది. అందుకే, అతడు మళ్లీ జాతీయ జట్టులోకి అడుగు పెట్టేందుకు ఆలోచనలు చేయాలి’’ అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు.
తగ్గని పదును
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న భువనేశ్వర్ పవర్ ప్లేలో అత్యంత కీలక బౌలర్. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో భువీ దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్లు హడలెత్తారు. ప్రస్తుతం అతడి వద్దే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్ ఉంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన భువనేశ్వర్ 17 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ కూడా 7.54 కావడం గమనార్హం. ఆర్సీబీ విజయాల్లో అతడిదే కీలక పాత్ర.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















